స్వతంత్ర అభ్యర్థిగా సుమలత నామినేషన్

sumalatha nomination
sumalatha nomination

బెంగళూరు: సుమలత మాండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ మాండ్య లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
సుమలత తన మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసే ముందు ఛాముండేశ్వరీ ఆలయాన్ని సుమలత సందర్శించారు. తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.