తూత్తుకుడికి ఇంటర్నెట్‌సేవలు బంద్‌

                           తూత్తుకుడికి ఇంటర్నెట్‌సేవలు బంద్‌

TUTUKODI
TUTUKODI

13కు చేరిన మృతులు
డిఎంకె స్టాలిన్‌ అరెస్ట్‌
చెన్నై: ట్యూటికోరన్‌ సమీపంలోని తూత్తుకుడివద్ద వేదాంత రిసోర్సెస్‌ ఏర్పాటుచేస్తున్న రాగి కర్మాగారం విస్తరణపనులను నిలిపివేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్మాగారానికి విద్యుత్‌సరఫరాను సైతం నిలిపివేసింది. అలాగే తమిళనాడు పర్యావరణ నియంత్రణమండలి ఈ ప్లాంట్‌ను మూసివేయాలని ఆదేవించింది. సచివాలయం ముందు నిరసన ప్రదర్శన చేసేందుకు యత్నించిన డిఎంకె వర్కింగ్‌ప్రెసిడెంట్‌ ఎంకె స్టాలిన్‌ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. వేదాంతగ్రూప్‌యూనిట్‌గా ఉన్న స్టెరిలైట్‌ కాపర్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన కంపెనీ విస్తరణపనులను నిలిపివేయాలంటూ చేసిన ఆందోళనలో ఇప్పటివరకూ 13మంది చనిపోయారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక ఒక యువకుడు చికిత్సపొందుతూ ఆసుపత్రిలోమృతిచెందాడు. అలాగే తూత్తుకుడిలో ఇంటర్నెెట్‌ సర్వీసులనుసైతం ప్రభుత్వం నిలిపివేసింది. డిఎంకె కు చెందిన ఎంకె స్టాలిన్‌ను పోలీసులుప్రభుత్వ ఉత్తర్వులమేరకు అదుపులోనికి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలుచేస్తూ ఆపార్టీలే హింసను రెచ్చగొట్టాయన్న విమర్శలుచేయడం, పోలీసులు ఆత్మరక్షణకోసం ఆందోళనకారులపై కాల్పులుజరిపారని చెప్పడంతో ఆయన నిరసనప్రదర్శనకు దిగారు. ఈ కర్మాగారం వల్ల స్థానికులకు వాతావరణం కాలుష్యం అయి రోగాలబారినపడుతున్నట్లు నిరసన వ్యక్తంచేస్తున్నారు. తూత్తుకుడి, పొరుగుజిల్లాలయిన తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోకూడా ఐదురోజులపాటు ఇంటర్నెట్‌సేవలు బంద్‌చేయాలని ఆదేశించింది. తమిళనాడుపోలీసులు జరిపిన కాల్పుల్లో పది మంది చనిపోగా మరోముగ్గురు బుధవారం రాత్రిచనిపోయారు. స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా జరిపిన నిరసనప్రదర్శనలు వందవరోజుకు చేరుకున్న సందర్భంగా తూత్తుకకుడి వాసులు పెద్ద ఎత్తునప్రదర్శనకు రావడంతో ఉద్రిక్తతలుపెరిగిపోలీస్‌ కాల్పులకు దారితీసింది.