ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గకపోవడంతో మార్కెట్లపై ప్రభావం

stock market
stock market

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం కొనసాగుతుండడం, అమెరికాలో భారీగా కరోనా మరణాలు సంభవించడంతో నేడు దేశీయ స్టాక్‌మార్కెట్లు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. నేడు నష్టాలతో మొదలయిన మార్కెట్లు ఓ దశలో 100 పాయింట్ల లాభపడ్డాయి. మరికొంత సేపటికి నష్టాలలోకి చేరుకున్నాయి. మళ్లీ కోలుకుని.. ప్రస్తుతం సెన్సెక్స్‌ 525 పాయింట్లు లాభపడి 30,592 వద్ద, నిఫ్టీ 155పాయింట్ల లాభంతో 8,948 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.48గా ఉంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/