‘శ్రుతి’ వేదాంతం

Sruti Hassan

 శ్రుతిహాసన్ ప్రస్తుతం `లాభం` అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. శివకార్తికేయన్ ఈ చిత్రంలో కథానాయకుడు. దీంతో పాటు ఇతర భాషల్లోనూ పలు సినిమాలకు సంతకాలు చేసింది. తెలుగులో ఓ సినిమా చేయనున్నానని ప్రకటించింది. ఇక తాజాగా శ్రుతి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్రేకప్ తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతున్నారు. “నేను నా జీవితంలో ఎంతో సంతోషకరమైన దశలో ఉన్నాను. ఎప్పుడూ లేనంత హ్యాపీగా ఉన్నాను. మైఖేల్ నుంచి బ్రేకప్ అయ్యాక .. శ్రుతి ఎందుకిలా చేస్తోంది అని అనుకున్నారంతా. కానీ అది నా జీవితంలో ఉత్తమ నిర్ణయం అనిపించింది. నేనెప్పుడూ నా సంతోషానికే ప్రాధాన్యతనిస్తాను. అది ఒక పెర్ఫ్యూమ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ మనం ఎక్కువ వాసన పీల్చేశాక.. ఒకవేళ బ్రేక్ తీసుకోకపోతే ఆ వాసన ఎలా ఉందో చెప్పలేం. అలాగే జీవితం కూడా దానంతట అది సాగుతుంటుంది. మనం తర్వాతి స్టెప్ తీసుకోకపోతే అది అలానే వెళ్లిపోతుంటుంది. ఆగి కొంచెం ఊపిరి తీసుకుంటే కానీ అసలు నిర్ణయంతీసుకోలేం. ఏం చేయాలి. ఎలా వెళ్ళాలి  అన్నది తేల్చేకోలేం“ అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది.