8నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం

టీటీడీ అధికారులు ఏర్పాట్లు

Lord Sri Venkatesa
Lord Sri Venkatesa

Tirumala: ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. ఏడుకొండలవాడిని కనులారా వీక్షించడానికి తిరుమల ఆలయంలో సర్వం సిద్ధమవుతోంది.

జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు .

జూన్ 8నాటికి కొన్ని ఆంక్షలతో భక్తులు శ్రీవారి ఆలయంలో శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుంది. 

సోమవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5 అమలులోకి రానున్ననేపథ్యంలో పలు సడలింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తెరవడం ఒకటి. 

ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి  తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/