శ్రీశైలంలో 12 నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

తాత్కాలికంగా పలుసేవల నిలిపివేత

Srisailam Temple
Srisailam Temple

శ్రీశైలం: ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో పలు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జిత కల్యాణం, రుద్రహోమం, ఏకాంత సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఆలయంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/