శ్రీశైలంలో మరికొన్ని రోజులు దర్శనాలు రద్దు

స్వామి సేవలన్నీ ఏకాంతమే

Srisailam-temple
Srisailam-temple

శ్రీశైలం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం సామాన్య భక్తులకు మరికొన్ని రోజులు అందుబాటులో ఉండదు. మరో ఐదు రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. స్వామి, అమ్మవార్లకు జరగాల్సిన సేవలన్నీ ఏకాంతంగా జరిపిస్తున్నట్టు ప్రకటించారు. పట్టణంలో వైరస్ ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, ఎక్కడికక్కడ శానిటైజ్ చేస్తున్నామని తెలిపారు.

ఇదిలావుండగా, తిరుమలకు వస్తున్న భక్తుల రాక మరింతగా మందగించింది. దర్శనాల సంఖ్య రోజుకు 6 వేలు దాటడం లేదు. నిన్న మంగళవారం స్వామిని 5,491 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. హుండీ ద్వారా 42 లక్షల ఆదాయం లభించిందని తెలిపారు. ఆన్ లైన్ మాధ్యమంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు, వైరస్ భయంతో దర్శనాలకు రావడం లేదని అధికారులు అంచనా వేశారు. త్వరలోనే స్థానికంగా దర్శనం టికెట్లను తిరిగి జారీ చేసే విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/