SAI తరహా మరో 20 క్రీడా ప్రాంగణాలు త్వరలో మరిన్ని

ఒలింపిక్స్ పైనే ద్రుష్టి త్వరలో మరిన్ని కేంద్రాలు -కిరెన్ రిజిజు

న్యూ ఢిల్లీ :2024 మరియు 2028 ఒలంపిక్స్ ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర క్రీడా శాఖ 20 క్రొత్త నేషనల్ సెంటర్స్ అఫ్ ఎక్సలెన్స్ ను రూపొందించింది . ఇదివరకు ఉన్న సెంటర్లలా కాకుండా అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు ఒకే ప్రాంగణం లో అందేలా చేస్తామని ప్రతి సెంటర్ అఫ్ ఎక్సలెన్స్ నుండి నిర్దిష్టంగా  4 నుండి 6 క్రీడలకు నిధుల్ని నిర్దేశిస్తుంది.

“క్యాంపస్ లో శిక్షణను మెరుగు చేయుట వల్ల అథ్లెట్లకు ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వటానికి ఆస్కారం ఉంది ప్రత్యేకంగా ఉంచిన సౌకర్యాలతో ఎక్కువ మంచి శిక్షణ పొంది ఫలితాలు చూపుతారు. మరిన్ని కేంద్రాలను తెరుచుటకు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ తో కలిసి పని చేస్తున్నాం” అని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. ఈ చర్య వల్ల  అట్టడుగు స్థాయి అథ్లెట్లకు కూడా SAI తరహా సౌకర్యాలతో శిక్షణ ఇవ్వబడుతుంది.

నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తించబడిన 20 ఎస్‌ఏఐ సౌకర్యాల గల కేంద్రాలు పాటియాలా,త్రివేండ్రం,చండీగర్,సోనెపట్,లక్నో,గౌహతి,ఇంఫాల్,కోల్‌కతా,భోపాల్,బెంగళూరు,ముంబై మరియు గాంధీనగర్,జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, ఢిల్లీ ఇందిరా స్టేడియం,ఢిల్లీ మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం, ఢిల్లీ డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్,ఢిల్లీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్,
నేషనల్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ (ఖేలో ఇండియా)అలెప్పీ, నేషనల్ బాక్సింగ్ అకాడమీ (ఖేలో ఇండియా)రోహ్తక్, నేషనల్ రెజ్లింగ్ అకాడమీ (ఖేలో ఇండియా)ఔరంగాబాద్.

మరిన్ని తాజా క్రీడా వార్తల కోసం https://www.vaartha.com/news/sports/