ఎస్‌పిజి లక్ష్యాన్ని పునరుద్ధరిస్తాం

Amit Shah
Amit Shah

ఢిల్లీ: గత ప్రభుత్వాలు ప్రత్యేక భద్రతా దళం(ఎస్‌పిజి) చట్టాన్ని నిర్వీర్యం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఎస్‌పిజి అసలు చట్టాన్ని తాము పునరుద్ధరించబోతున్నామని తెలిపారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని, మాజీ ప్రధానికి భద్రత కల్పించే ఉద్దేశంతో 1988లో ఈ బిల్లును తీసుకొచ్చారని గుర్తు చేశారు. కానీ ఇకపై ప్రధానితో పాటు ఆయన అధికారిక నివాసంలో ఉండే కుటుంబానికి మాత్రమే ఎస్‌పిజి భద్రతను కల్పించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా మాజీ ప్రధానితో పాటు ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్లపాటు ఎస్‌పిజి భద్రతను కల్పించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చట్టాన్ని సవరిస్తూ దాన్ని అసలు లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారని అమిత్‌ షా ఆరోపించారు. కాగా గాంధీ కుటుంబ సభ్యులైనా సోనియా, రాహుల్‌, ప్రియాంకకు ఎస్‌పిజి భద్రతను ఇటీవల కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. దాదాపుగా మూడు దశాబ్దాల కాలంపాటు వారికి ప్రత్యేక భద్రతను కల్పించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ చట్టాన్ని సమరించేందుకు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/