హైస్పీడ్‌ నెట్‌ సేవలకు నింగిలోకి 60 శాటిలైట్స్‌

space X
space X

వాషింగ్టన్‌: అమెరికా కంపెనీ స్పేస్‌ఎక్స్‌ 60 ఉపగ్రహాలను ఇంటర్నెట్‌ సేవల కోసం నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఫ్లోరిడాలోని కేప్‌ కనరవల్‌ ప్రయోగశాల నుంచి ఆ శాటిలైట్స్‌ను ప్రయోగించారు. వాటి ద్వారా ఇక నుంచి హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి. స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12 వేల స్పేస్‌ క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్‌ మస్క్‌ కంపెనీ భావిస్తున్నది. ఇంటర్నెట్‌ సేవల కోసం స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్లను ప్రయోగిస్తున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/