రాబోయే ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

akhilesh yadav
akhilesh yadav

లక్నో: యుపిలో రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్దమవుతున్నామని , 11సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. బహుజన్‌ సమాజీ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని, అఖిలేష్‌ తేల్చి చెప్పేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎస్పీ-బిఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్‌ భార్య డింపుల్‌ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్లు పలువురు ఘోర ఓటమి చవి చూశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/