ముగిసిన బాలు అంత్యక్రియలు

ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలు అంత్యక్రియలు

sp-balasubrahmanyam-funera

చెన్నై: గాన గంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. తిరుమళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో శైవ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరిగాయి. అంతకుముందు కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం వైదిక క్రతువులు పూర్తి చేశారు. ఆయనను కూర్చోబెట్టి ఖననం చేశారు.

కాగా బాలు అంతిమ సంస్కారాలకు ఏపి ప్రభుత్వం తరుఫున నీటి పారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. సినీ డైరెక్టర్‌ భారతీరాజా, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌, గాయకుడు మనోతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బాలు పార్థివ దేహానికి కడసారి నివాళులర్పించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/