10 లక్షల కంటే ఎక్కువగా డ్రా చేస్తే పన్ను!

బ్లాక్‌మనికి అడ్డుకట్ట, డిజిటల్‌ లావాదేవీలకు ప్రోత్సాహం

cash withdrawal
cash withdrawal

న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకుగాను, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఏడాదిలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విత్‌ డ్రా చేసే వారిపై పన్ను భారం పడనుంది. ఎక్కువ మొత్తంలో నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే ఆధార్‌ ధృవీకరణ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. పేద, మధ్యతరగతి వర్గాలకు భారం కాకుండా నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది. డిజిటల్‌ లావాదేవీలను పెంచేందుకు ఆర్‌బిఐ ఈ చర్యలు చేపట్టింది. గతంలో యూపిఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఐతే ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందలేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/