జీ వాటాలు, సోనీ కొనుగోలు

subhash chandra
subhash chandra, zee group chairman


ముంబై: సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లను కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ సంస్థ ఆసక్తి చూపుతుంది. ఇప్పటికే ఈ చర్చలు చివరి దశలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని , విక్రయించగా వచ్చిన రూ. 13 వేల కోట్లను రుణాలు చెల్లించేందుకు వినియోగించాలని అనుకుంటున్నారు. ఈ షేర్లపై సుభాష్‌ చంద్ర దాదాపు 30 శాతం ప్రీమియం కోరుతున్నట్లు సమాచారం. సుభాష్‌ చంద్ర ఎంత వాటా తన దగ్గర ఉంచుకోవాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఎస్సెల్‌ గ్రూప్‌ జీలో 41.62 శాతం వాటాను కలిగిఉంది. సగంపైగా రుణదాతల వద్ద తనాఖాలో ఉన్నాయి. ఆయన ఒక్కో షేరు రూ.650 రేటు వద్ద తన 19 శాతం వాటా విక్రయించినా రూ. 13 వేల కోట్ల వరకు పొందే అవకాశం ఉంది. ఈ సొమ్ముతో పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు. సుభాష్‌ తన వద్ద దాదాపు 20 శాతం వాటా ఉంచుకోవాలనుకుంటున్నారు. ఈ విక్రయంతో సోనీ వ్యాపారం లాభపడనుంది.