అమెరికాలో మంచు తుఫాను, పలు విమానాల రద్దు

bomb cyclone hits central us
bomb cyclone hits central us


కొలరాడో: అమెరికాను మంచు తుఫాను భయపెడుతుంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటలకు 148 కిలో మీటర్ల వేగంతో వీస్తున్న ఈ గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుఫానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుఫానును బాంబ్‌ తుఫానుగా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. విమనాల రాకపోకలను నిలిపి వేశారు. దీంతో 1339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండడంతో అధికారులు అప్రమత్తమవుతున్నాయి. భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించి ఆసుపత్రికి తరలించారు.