తెలంగాణ ముఖ్యమంత్రి హర్షం

Sindhu with Kcr (file)
Sindhu with Kcr (file)

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచ టూర్‌ టైటిల్‌ గెలవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా పీవీ సింధు చరిత్ర సృష్టించిందని కేసీఆర్‌ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిని నొజోమి ఒకుహరాపై 21-19, 21-17 తేడాతో పీవీ సింధు విజయం సాధించారు. ప్రతిష్టాత్మక వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో పీవీ సింధు విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు