సూపర్ స్టైలిష్ ఈజ్ బ్యాక్!

Shruti Hassan New Dress Look
Shruti Hassan New Dress Look

శృతి హాసన్ వేరు అనేది ఎప్పుడూ ఋజువు చేస్తూనే ఉంటుంది. 
షకీరాల తరహాలో ఇంటర్నేషనల్ సింగర్ అవుతానంటూ ఆంగ్లంలో పాటలందుకోవడం.. ఇప్పుడేమో మళ్ళీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుండడం.. ఇలా చెప్పుకుంటూ పోతే శృతి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి
తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు శృతి “లండన్ నైట్స్ @మ్యాడాక్స్ గ్యాలరీ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఇక ఫోటోల్లో ఆ స్టైల్ మామూలుగా లేదు.  ఒక పాప్ సింగర్ తరహాలో డీప్ వీనెక్ ఉన్న బ్లాక్ గౌన్… ఆ పైన బ్లాక్ జాకెట్ ధరించింది.  మెడలో పెద్ద పెద్ద కాయిన్స్ తరహాలో పూసలు ఉండే చెయిన్ వేసుకుంది. ఇక పర్పుల్ కలర్ లిప్ స్టిక్ తో ‘నేను యమా బోల్డ్’  అన్నట్టుగా ఒక స్టైలిష్ లుక్ ఇచ్చింది.   ఓవరాల్ గా లుక్ అదిరిపోయింది.  ఇలా హాలీవుడ్ హీరోయిన్ల తరహాలో కనిపించి మెప్పించడం సాధారణ విషయం కాదు.. పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి.  కరెక్ట్ గా ఆ డ్రెస్ కు తగ్గట్టుగా స్టైల్ ను రంగరించింది.