తిరుపతికి రానున్న షియోమీ

AP Govt
సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల సమక్షంలోఎంఓయు

తిరుపతికి రానున్న షియోమీ

హోలీటెక్‌ మొబైల్‌ విడిభాగాల తయారీ కంపెనీ
ఏపి ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం

విజయవాడ: ఏపికి మరో పెద్ద ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ తిరుపతికి రానుంది. సోమవారం సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ల సమక్షంలో ఈ మేరకు ఎంఓయు కుదిరింది. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ హోలీటెక్‌ కావడం విశేషం. ఇప్పటివరకు కేవలం ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లింగ్‌ కంపెనీలు మాత్రమే వున్నాయి. కానీ మొదటిసారి ఏపిలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ రాబోతోంది. మొబైల్‌ఫోన్లలోని కెమేరా మాడ్యూల్స్‌, టిఎఫ్‌టి స్క్రీన్స్‌ తయారు చేయనుంది. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో రెండు మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో రు.1400 కోట్ల పెట్టుబడితో 6వేల మంది ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ ప్రారంభిం చడం శుభపరిణామమన్నారు.

త్వరలో మీ పనులు ప్రారంభిం చాలని సూచించారు. రాష్ట్రంలో ఏకో సిస్టం రావడం చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న అన్ని పరిశ్రమలకు తగిన వసతులు, సౌకర్యా లను కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతికి చేరువలో కృష్ణపట్నం తో సమా రెండు ఓడరేవులున్నాయన్నారు. ఐఐటి స్థాయి విద్యాసంస్థల ఏర్పాటు కు చర్యలు తీసుకుంటామని వివరించారు. చెన్నై, నెల్లూరు, తిరుపతి పట్టణ ాలతో కూడిన త్రికోణం భూభాగం పారిశ్రామిక వాడ అభివృద్ధికి అనుకూలం గా వుందన్నారు.

ఏపిఐఐసి పరిశ్రమకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో సహకరిస్తుందన్నారు. జనవరిలో ఉత్పత్తి ప్రారంభించాలని సిఎం వారికి సూచించారు. పరిశ్రమల స్థాపన, వ్యాపార నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకెళుతోం దన్నారు. తిరుపతి నుండి రోడ్లు, రైళ్ళు, సముద్రయానం వంటి సకల సౌకర్యాలు అందుబాటులో వుంచా మన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌, నీటి వనరులకు లోటు లేదన్నారు. సమర్ద వంత, సాంకేతిక అనుభవం వున్న మానవ వనరుల లభ్యత కూడా పుష్కలంగా వుందన్నారు. రాష్ట్రం బాగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులు పుష్కలంగా వున్నాయన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం రెండేళ్ల నుండి మొదటిస్థానంలో వుందన్నారు. జాతీయంగా 7,8 శాతం అభివృద్ధి వుంటే రాష్ట్రంలో నికరంగా 10.5 శాతం వృద్ధిని సాధిస్తున్నా మన్నారు. 15 శాతం వృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నా మన్నారు. అనంతపురంలో దక్షిణ కొరియా కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుకు అయిదు నెలల్లో నీటివనరుల కల్పనలో కృతకృత్యుల య్యామన్నారు. చైనాలోకంటే ఇండియాలో పరిశ్రమల ఏర్పాటుకు మంచి ప్రభుత్వం, అవకాశాలున్నాయని సిఎం తెలిపారు. ఈ రోజు నుండే కంపెనీ పనులు ప్రారంభించాలని సిఎం తెలిపారు. మీరుమా విలువైన అతిథి. మనం పరస్పర సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుదామన్నారు.మంత్రి నారా లోకేష్‌, హోలీటెక్‌ సిఇఓ ఫ్లేమ్‌చంద్‌, షియోమీ వైస్‌ ప్రెసిడెంట్‌ మనోజైన్‌, సిఎం కార్యదర్శి రాజమౌళి, ఐటి ముఖ్య కార్యదర్శి విజయానంద్‌ పాల్గొన్నారు.