హరహర మహాదేవ…

నేడు మహాశివరాత్రి
తెల్లవారుజామునుంచే శైవక్షేత్రాల్లో అభిషేకాలు
స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

Lord Shiva

మహాశివరాత్రికి శివాలయాలు భక్తులను పరవశింప జేసేందుకు ముస్తాబయ్యాయి.నేటి తెల్లవారు జాము నుంచి శివరాత్రి వేడుకలు ప్రారంభం అయ్యాయి.దేవాదాయశాఖ ఆధ్వ ర్యంలో అన్ని దేవాలయాల వద్ద విస్త్రుృత ఏర్పాట్లు చేశారు.శివరాత్రి పర్యదినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ముక్కొటి దేవతల్లో శివుడు సనాతనుడు,భోళాశంకరుడు,భక్త వశం కరుడు, పంచభూతాలకు అధినాథుడు.

శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు.సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు.లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి, కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించటం ఆనవాయితిగా వస్తోంది.అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరమథనం చేస్తుం డగా, ముందుగా హలాహలం పుట్టింది. హలాహల విషజ్వాలలు
ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్తవశంకరుడన శివుడు మరో ఆలోచన లేకుండా ,హాలాహలాన్ని ఒడిసి పట్టి,దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు, గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారటంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పి పడిపోయాడు.

పార్వతీదేవి భర్తతలను తన ఒడిలోకి తీసుకుని చింతించసాగింది.జరిగిన పరిణామానికి దేవదానవు లందరూ భీతిల్లారు.శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగారం చేశారు.నాటి నుంచి శివరాత్రి రోజున భక్తి శ్రద్దలతో శివుని ,పూజించి జాగరం చేయటం ఆనవాయితిగా మారినట్లు పురాణాల కథనం..మహాశివరాత్రి ప్రాసస్త్యానికి సంబంధించిన క్షీరసాగర మథనం ఘట్టం అందరికి తెలిసిందే.

అయితే ఇదే రోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ,తంత్ర గ్రంధాలు చెబుతున్నాయి.శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయటం ద్వారా కుండలీని శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని ,ప్రసిద్ద శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు,భజనల్లో పాల్గొంటారు.

ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా జిల్లాలోని అతి ముఖ్యమైన శైవక్షేత్రాలైన కోటప్పకొండ,పెదకాకాని,క్వారీ,చుండూరు,గోవాడతో పాటు జిల్లాలో ఉన్న పలు శివాలయాల వద్ద భక్తుజనులను అలరించేందుకు దేదీప్యమానంగా వెలుగొందే విద్యుత్‌ ప్రభలను తీర్చిదిద్దుతున్నారు. గురువారం రాత్రి నుంచే ఈ ప్రభలు భక్తులను కనువిందు చేస్తున్నాయి.విద్యుత్‌ ప్రభలపై సాంప్రదాయమైన నృత్యప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

శివుడు అందరివాడు….

Lord Shiva in Kotappa konda , Narasarao pet, Guntur District

బ్రహ్మ,విష్ణు,దేవేంద్రాది దేవతలే కాదు,రావణుడు,బాణాసురుడు,భస్మాసురుడు,వంటి దానవులు,వాలి వంటి వానరులు, సమస్త రుషులు,ఆది శంకరాచార్యులు వంటి ఆధ్యాత్మిక గురువులు,కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే.. కాళహస్తి మహాత్యం కథనం ప్రకారం సాలెపురుగు,సర్పం ,ఏనుగు,కూడా శివుని పూజించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.దేవదానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చేబుతున్నాయి. రామాయణ,మహాభారత కాలాల నాటికే శైవమత, వ్యాప్తి విస్తారంగా ఉండేది .బ్రహ్మ,సృష్టికారకుడని,విష్టువు స్థితికారకుడని,శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయకు శివుడే కారకుడు. శివడు పరబ్రహ్మ స్వరుపుడు,శివుడే ఆదిదేవుడు, సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/