వరల్డ్‌కప్‌కు ధావన్‌ పూర్తిగా దూరం

shikhar dhawan
shikhar dhawan

లండన్‌: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయపడ్డ శిఖర్‌ ధావన్‌ మెగా టోర్నీ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే సూచనలు కన్పించకపోవడంతో అతని స్థానంలో రిషబ్‌పంత్‌ను తీసుకోవాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అతని స్థానంలో రిషబ్‌పంత్‌ను అధికారికంగా తుది జట్టుకు ఎంపిక చేశారు. పంత్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌కు వచ్చి జట్టుతో పాటు సాధన చేస్తున్నాడు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/