పాట్నా సాహిబ్‌ నుంచి శతృఘ్నసిన్హా పోటీ!

Shatrughan Sinha
Shatrughan Sinha, bjp rebel


హైదరాబాద్‌: బిజెపిలో రెబల్‌గా మారిన ఎంపి శతృఘ్నసిన్హా…ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. బీహార్‌కు చెందిన ఎంపి శతృఘ్న సిన్హా ఈ సారి పాట్నా సాహిబ్‌ నుంచి పోటీ చేయనున్నారు. పార్టీలో ఉంటూనే ప్రధాని మోది తీరును వ్యతిరేకిస్తూ వస్తున్న శతృఘ్న సిన్హా పార్టీని వీడే సూచనలు కనబడుతున్నాయి. మోదిపై ఎన్ని విమర్శలు చేసినా బిజెపి మాత్రం మాజీ ఫిల్మ్‌స్టార్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కూడా ఆయన పాట్నా సాహిబ్‌ నుంచే పోటీ చేసి గెలిచారు. ఈ సారి కూడా ఆయన అక్కడ నుంచే పోటీ చేయనున్నట్లు సమాచారం.