నమ్మిన సిద్ధాంతం కోసం స్థిరంగా నిలబడేవారు

బాల్‌ఠాక్రే జీవితం, పాటించిన విలువలు తమకు స్ఫూర్తిదాయకం

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: గురువారం శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే (బాల్‌ ఠాక్రే) జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆయనకు నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాల్‌ ఠాక్రే ఎంతో విజ్ఞతతో వ్యవహరించేవారని, నమ్ముకున్న సిద్థాంతం, ఆదర్శాల కోసం ఆయన ఎక్కడా రాజీపడలేదని అన్నారు. బాల్‌ఠాక్రే తన ప్రసంగంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేవారని ఆయన గుర్తుచేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం స్థిరంగా నిలబడేవారనీ..ఎక్కడా రాజీపడలేదని అన్నారు. బాల్‌ఠాక్రే జీవితం, ఆయన పాటించిన విలువలు తమకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అమిత్‌ షా తెలిపారు. కాగా బిజెపితో కొన్ని దశాబ్దాలుగా ఉన్న బంధాన్ని వీడి శివసేన గతేడాది నవంబర్‌లో కాంగ్రెస్‌, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్‌ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/