శృంగార స్వేచ్ఛ నేరం కాదు

SEX
Img

శృంగార స్వేచ్ఛ నేరం కాదు

ఐపిసి 497 రాజ్యాంగవిరుద్ధం
ఒక భర్త భార్యకు అధిపతి కాకూడదు
స్వేఛ్ఛ సమానత్వం, సమాన హక్కులు

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా సంచలనాత్మక తీర్పు వెల్లడించింది. చీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షతన ఉన్న ఐదుగురుసభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం శృంగార స్వేఛ్ఛ ఎంతమాత్రం నేరం కాదని ఐపిసిలోని సెక్షన్‌ 497ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఒక వ్యక్తికి ఉన్న లైంగిక స్వేఛ్ఛను నేరంగా పరిగణించడం ఎంతమాత్రం సహేతుకం కాదని బెంచ్‌ అభిప్రాయపడింది. ఒక భర్త భార్యకు ఎంతమాత్రం అధిపతి కాకూడదని, రాజ్యాంగంలో స్వేఛ్ఛ సమానత్వం, సమానహక్కులు అందరికీ ఉన్నందున ఈ సెక్షన్‌కింద భర్తను మాత్రమే శిక్షించాల్సిన ఔచిత్యం లేదని అభిప్రాయపడింది. ఐపిసిలోని సెక్షన్‌ 497 కింద భర్తకు ఆతనిభార్య ప్రియునికి శిక్షించే హక్కును కల్పిస్తోందని, నేరం రుజువు అయిన పక్షంలో ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఐదేళ్లవరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అదే హక్కు భార్యపై ఎందుకు విధించకూడదని కేరళకు చెందిన ఒక వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సెక్షన్‌ 497ను రద్దుచేయాలని అభిప్రాయపడింది.

న్యూఢిల్లీ: శృంగారస్వేచ్ఛ ఎంతమాత్రం నేరం కాదని ఐపిసిలోని సెక్షన్‌ 497ను సుప్రీంకోర్టు రద్దుచేసింది. ఛీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అధ్యక్షతన ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం స్వాతంత్య్రానికి పూర్వంనుంచి ఉన్న ఈ ఐపిసి సెక్షన్‌ను అనుసరించి ఒక వ్యక్తికి ఉన్న శృంగార స్వేచ్ఛను నేరంగా పరిగణించడం ఎంతమాత్రం సహేతుకం కాదని బెంచ్‌ అభిప్రాయపడింది. ఒక భర్త భార్యకు ఎంతమాత్రం అధిపతి కాకూడదని, రాజ్యాంగంలో స్వేఛ్ఛ సమానత్వం, సమాన హక్కులు అందరికీ ఉన్నందున ఈ సెక్షన్‌కింద భర్తను మాత్రమే శిక్షించాల్సిన ఔచిత్యం లేదని అభిప్రాయపడింది. ఐపిసిలోని సెక్షన్‌ 497 కింద భర్తకు ఆతనిభార్య ప్రియునికి శిక్షించే హక్కును కల్పిస్తోందని, నేరం రుజువు అయిన పక్షంలో ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఐదేళ్లవరకూ జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

అదే హక్కు భార్యపై ఎందుకు విధించకూడదని కేరళకు చెందిన ఒక వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సెక్షన్‌ 497ను రద్దుచేయాలని అభిప్రాయపడింది. ఇదేనేరానికి పాల్పడిన భర్తతో మరొక మహిళ వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎలాంటి శిక్షలు లేవని, కేవలం భర్తకు మాత్రమే వివాహేతర సంబంధంపై శిక్షించే అవకాశం ఉందని వాదించింది. అయితే సెక్షన్‌ 497 అవివాహిత మహిళలతో భర్త వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే ఎలాంటి విచారణలు లేవని కూడా గుర్తించింది. చీఫ్‌జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌ వివాహేతర సంబంధాన్ని నేరపూరితం చేయడం ఏకపక్షమని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. అసంతృప్తికర వైవాహిక జీవితానికి లైంగిక సంబంధంమే కారణం కాదని, దీని ఆధారంగా వ్యక్తులను శిక్షించడం ఏకపక్షమే అవుతుందని అన్నారు. వివాహేతరసంబంధానికి నేరం ఆపాదించడం ఎంతమాత్రం సహేతుకం కాదని, అయితే ఈ వివాహేతర సంబంధిం వివాహాలను రద్దుచేసేందుకుసైతం దారితీస్తోందని ఆయన పేర్కొన్నారు.

జస్టిస్‌ రోహింటన్‌ ఎఫ్‌ నారిమన్‌ మాట్లాడుతూ ఒకవిధమైన ఏకపక్ష అభిన్రపాయంతో సెక్షన్‌ 497 నడుస్తోందని, లైంగిక సంబంధంలో భర్త పాత్రను మాత్రమే శిక్షార్హం చేయడం కూడా ఏకపక్షం అవుతుందని వెల్లడించారు. 150 ఏళ్లనాటి ఈ సెక్షన్‌ను రద్దుచేయాల్సిందేనని అభిప్రనాయపడ్డారు. సమానత్వానికి, ప్రాథమిక హక్కులను ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో స్వేఛ్ఛ, హోదా, సమానత్వాన్ని విస్మరించడమే అవుతుందని అభిప్రాయం వ్యక్తంచేసారు. మహిళలను భర్తల తాత్కాలిక ఆస్తిగా మాత్రమే భావిస్తున్నారని, ప్రాచీన అభిన్రపాయాల ఆధారంగా ఈచట్టం తయారైందనట్లుగా భావించారు. పురుషుడువివాహేతర సంబంధం కొనసాగిస్తే మహిళ ఆతనికి బలి అవుతున్నదని, ఈ వివాదాస్పదసెక్షన్‌ను పారద్రోలాలని జస్టిస్‌ నారిమన్‌ పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రాకూడా నారిమన్‌ అభిప్రాయంతో ఏకీభవించారు.

జస్టిస్‌ వైవి చంద్రచూడ్‌ మాట్లాడుతూ మహిళల లైంగిక స్వయంప్రతిపత్తి వివాహపరిధిలోనే ఉందన్నారు.వైవాహిక జీవితంలో ప్రతి ఒక్కరూ లైంగిక స్వయంప్రతిపత్తిని పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. దీనివల్ల ఇరువురికీ పరస్పర గౌరవభావం పెరుగుతుందని అన్నారు. వివాహం అంటే ఒకరి స్వయంప్రతిపత్తిపై మరొకరు ఆధిపత్యంచేయడం కాదని మానవస్వేఛ్ఛకు లైంగిక స్వేఛ్ఛకూడా కీలకమే అవుతుందని అన్నారు. ఒక వ్యక్తికి వ్యక్తిగత అవసరాల్లో ఆమె ప్రాధాన్యతను కూడా గుర్తించాల్సినఅవసరం ఉందన్నారు. కేరళకు చెందిన జోసఫ్‌షైన్‌ దాఖలుచేసిన ఈపిటిషన్‌పై న్యాయవాదులు కాళీశ్వరంరాజ్‌, ఎంఎస్‌ యువిదత్‌లు వాదనలు వినిపించారు. ఇరువాదనలు విన్న అనంతరం ఐపిసి 497 సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం అభిప్రాయపడింది.