పారికర్‌ జ్ఞాపకంగా ప్రతిమలు ఏర్పాటు చేయండి

manohar parrikar
manohar parrikar


అమేథి: ఉత్తరప్రదేశ్‌లోని రాహల్‌ నియోజకవర్గం అమేథి పరిధిలోని బరౌలియా, హరిహరపూర్‌ గ్రామాల ప్రజలు దివంగత గోవా మాజీ సియం పారికర్‌ విగ్రహం తమ గ్రామాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మనోహర్‌ పారికర్‌కు ఆ రెండు గ్రామాలతో ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి పారికర్‌ రాజ్యసభ సభ్యునిగా ఎంపికైన విషయం తెలిసిందే. అ క్రమంలోనే ఆ రెండు గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ యోజన పథకం కింద ఆయన దత్తత తీసుకున్నారు. అందుకే పారికర మరణం పట్ల ఆ రెండు గ్రామాల ప్రజలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుల్ని కోల్పోయినంత బాధగా ఉంది అని బరౌలియా మాజీ గ్రామ ప్రధాన్‌ సురేంద్ర ప్రతాప్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో పారికర్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపి సియం యోగి ఆదిత్యనాథ్‌ను సంప్రదించారని తెలిపారు. ఆయన విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం అని, లేదంటే మేమే విరాళాలు సేకరించి పనులు మొదలు పెడతాం అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ రెండు గ్రామాల అభివృద్దికి పారికర్‌ ఎంతో కృషి చేశారు. రెండు గ్రామాల్లో మునుపెన్నడూ లేని స్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లు, పాఠశాలలు, సోలార్‌ లైట్లు, చెరువుల అభివృద్ధి, నైపుణ్య శిక్షణా కేంద్రాలు లాంటి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామ పెద్దలతో పారికర్‌ తరచూ మాట్లాతుండేవారు. మరిన్ని కార్యక్రమాలపై చర్చించడానికి ఢిల్లీ రావాలని కోరేవారు అని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గ్రామ ప్రజలు గుర్తుచేసుకున్నారు.