పుదుచ్చేరి సియంకి సుప్రీం నోటీసులు

narayana swami
narayana swami

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి వి నారాయణస్వామికి అధికారాల విషయంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రోజువారి జరిగే ప్రభుత్వ వ్యవహారాలలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ జోక్యం చేసుకోవద్దని ఈ మధ్యనే మద్రాస్‌ హైకోర్టు చెప్పింది. ఆర్థిక విషయాలపై పుదుచ్చేరి ప్రభుత్వం జూన్‌ 7న నిర్వహించే సమావేశంలో తీసుకునే నిర్ణయం జూన్‌ 21న వరకు అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు జడ్జిలు ఇందు మల్హోత్రా, ఎంఆర్‌ షాలు సూత్రప్రాయంగా చెప్పారు. పుదుచ్చేరిలో అంతకుముందు పరిస్థితులపై ఏప్రిల్‌ 30న వెలువడిన తీర్పుపై కేంద్రం, కిరణ్‌బేడీ ఉన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తిపై నారాయణస్వామి, పార్టీ ఈ విషయాలపై చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, అందుకు సమాధానమివ్వాలని బెంచ్‌ కోరింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/