కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు

supreem, rafale
supreem, rafale


న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో మోది ప్రభుత్వాన్కి సుప్రీంలో చుక్కెదురైంది. రహస్య డాక్యుమెంట్ల ఆధారంగా తీర్పును సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది. రాఫెల్‌ కొనుగోలుపై మోది ప్రభుత్వం అభ్యంతరాను రంజన్‌ గొగో§్‌ు ధర్మాసనం వ్యతిరేకించింది. రక్షణశాఖ నుంచి చోరీ చేసిన డాక్యుమెంట్లపై కేసును సమీక్షించరాదు అంటూ సుప్రీం కేంద్రాన్ని కోరింది. కానీ ఆ అభ్యంతరాలను చీఫ్‌ జస్టిస్‌ తిరస్కరించారు. వాస్తవానికి గత డిసెంబరులో ఇచ్చిన తీర్పులో రాఫెల్‌ ఆధారంగా కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరగలేదని సుప్రీం వెల్లడించింది. రహస్య పత్రాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని కేంద్రం కోర్టు ముందు వాదించింది. దాన్ని కోర్టు తిరస్కరించింది. 36 రాఫేల్‌ యుధ్దవిమానాలను భారత్‌ ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఆ విమానాల తయారీ కోసం అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ సంస్థకు అక్రమ పద్ధతిలో కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలుస్తుంది. కొత్త డాక్యుమెంట్ల ఆధారంగానే తీర్పును సమీక్షిస్తామని సుప్రీం చెప్పింది. ఐతే ఎప్పడు దానిపై విచారణ చేపట్టాలన్న అంశంపై త్వరలోనే తేదీలను వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/