మోది బయోపిక్‌పై సోమవారం సుప్రీం విచారణ

modi biopic
modi biopic


న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోది జీవిత కథ ఆధారంగా నిర్మించిన చిత్రం ‘పిఎం నరేంద్ర మోది’. ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల సమయం కావడంతో ఈ చిత్రంపై కాంగ్రెస్‌ నేతలు ఈసికి ఫిర్యాదు చేశారు. ఐతే సుప్రీం ఈ పిటిషన్‌పై విచారించేందుకు అంగీకరించింది. దీనిపై సోమవారం వాదనలు వింటామని వెల్లడించింది.
వివేక్‌ ఒబెరా§్‌ు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మోది గుజరాత్‌ సియం ఐనప్పటి నుంచి 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందటం వరకు అన్ని కోణాలను చూపాయనేది కాంగ్రెస్‌ వాదన. దీంతో ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని చూసి ఓటర్లు ప్రభావితం కావచ్చనే అనుమానాన్ని ఆ పిటిషన్‌లో కాంగ్రెస్‌ నేతలు వ్యక్తపరచారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే నని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రతినిధి అమన్‌ పన్వార్‌ ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/