2023 నాటికి శాప్‌ మార్కెట్‌ విలువ డబుల్‌!

Bill McDermott, SAP chief executive
Bill McDermott, SAP chief executive


బెర్లిన్‌: యూరప్‌లోని అతిపెద్ద సాంకేతిక పరిజ్ఞానంలో దిగ్గజ కంపెనీ శాప్‌ అతిపెద్ద లక్ష్యాన్ని నిర్ధారించుకుంది. 2023 నాటికి కంపెనీలో 250 బిలియన్‌ యూరోల నుంచి 300 బిలియన్‌ యూరోల మధ్య అంటే మార్కెట్‌ విలువ రెండింతలు పెరగాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బిల్‌ మాక్‌డెర్మోట్‌ ఓ జర్మన్‌ వార్తాపప్రతికతో అన్నారు. శాప్‌ కంపెనీలో 2010లో సిఈఓగా చేరినపుడు మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 45 బిలియన్‌ యూరోల నుంచి 140 బిలియన్‌ యూరోలకు పెరిగింది. 2023 నాటికి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ను 250 నుంచి 300 బిలియన్‌ యూరోలు పెంచాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/