ఐటిసి కొత్త ఛైర్మన్‌గా సంజీవ్‌ పురి నియామకం

sanjiv puri
sanjiv puri, ITC new chairman

న్యూఢిల్లీ: ఐటిసి కొత్త ఛైర్మన్‌గా సంజీవ్‌పురిని నియమించారు. బోర్డు డైరెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నాడు. రెండు రోజుల క్రితం ఐటిసి ఛైర్మన్‌ యోగేశ్‌ చందర్‌ దేవేశ్వర్‌ కన్నుమూసిన విషయం తెలిసిందే. డిసెంబరు 2015లో ఐటిసి బోర్డు సభ్యునిగా సంజీవ్‌ నియమితులయ్యారు. ఆ తర్వాత 2017లో సీఈఓగా మారారు. ఐఐటి కాన్పూర్‌లో సంజీవ్‌పురి విద్యాభ్యాసం చేశారు. గతంలో ఎఫ్‌ఎంసిజి వ్యాపారానికి అనేక బాధ్యతలు నిర్వర్తించారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/