భువీకే అవకాశమివ్వాలి

Sachin Tendulkar
Sachin Tendulkar

ముంబై: తొడ కండరాల గాయంతో ఆఫ్గాన్‌ మ్యాచ్‌కు దూరమైన భువనేశ్వర్‌ తిరిగి కోలుకున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో జరిగే పోరు తుది జట్టులో షమి, భువనేశ్వర్‌లో ఎవరికి చోటు దక్కుతుందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భువీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే తుది జట్టులో అతనికే చోటివ్వాలని పేర్కొన్నాడు.
తాను భువీకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని, ఎందుకంటే అతను బంతిని స్వింగ్‌ చేస్తూ విండీస్‌ టాప్‌ ఆర్డర్‌ను ఇబ్బందుల్లో పెట్టగలడు అని సచిన్‌ అన్నాడు. ఐతే వెస్టిండీస్‌తో పోరుకు భువీ సిద్దంగా ఉన్నట్లు భారత జట్టు యాజమాన్యం ఇప్పటి వరకు ప్రకటించలేదు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos