అగ్గి రాజేస్తున్న అక్కినేని హీరోయిన్

Ruhaani Sharma
Ruhaani Sharma

తాజాగా చి.ల.సౌ ఫేం.. యంగ్ బ్యూటీ రుహానీ శర్మ సోషల్ మీడియాలో టచ్ లోకొచ్చింది. ఈ భామ తాజా పోస్టింగ్ జోరుగా వైరల్ అవుతోంది. రుహాని నటించిన తొలి సినిమా `చి.ల.సౌ` బాక్సాఫీస్ వద్ద ఆశించినంత పెద్ద సక్సెస్ సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సుశాంత్ – రుహానీ జంట నటనకు పేరొచ్చింది. ఆ సినిమాలో సింపుల్ మిడిల్ క్లాస్ గాళ్ పాత్రలో రుహానీ చక్కని అభినయం కనబరిచింది. అయినా ఎందుకనో ఈ అమ్మడు రెండో అవకాశం అందుకోవడంలో మాత్రం తడబడుతోంది. చి.ల.సౌ రిలీజై ఇంతకాలమైనా ఇంకా తెలుగులో వేరొక సినిమాకి సంతకం చేయలేదు. కనీసం ఇతర పరిశ్రమల్లో అయినా ఏ అవకాశం అందుకుందో తెలీదు.