ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం?

‘రాహుల్ గాంధీని శిక్షించాల్సిందే’ స్మృతీ ఇరానీ!

smriti irani - lok sabha
smriti irani – lok sabha

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మేకిన్ ఇండియాను రేప్ ఇన్ ఇండియాగా మార్చేశారు అని నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. అయితే దీంతో ఈరోజు ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే, రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. బిజెపి మహిళా ఎంపీలు రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, లోక్ సభలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావిస్తున్న సమయంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఓ బాధ్యతాయుతమైన రాజకీయ నేతగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం? ఆయనకు తగిన శిక్ష పడాల్సిందే స్మృతీ ఇరానీ అన్నారు. అందుకు ప్రతిగా కాంగ్రెస్ తదితర విపక్షాలు నినాదాలు ప్రారంభించడంతో సభలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన సభలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆపై సభ ఎంత సేపటికీ అదుపులోకి రాకపోవడంతో మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/