రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ నిరాహార దీక్ష

ఎంపీల ప్రవర్తనకు నిరసనగా ..నిరాహార దీక్ష

rajya-sabha-deputy-chairman-on-one-day-fast-against-unruly-behaviour-of-opposition-mps

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ విపక్ష ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఈరోజు ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. ‘రెండు రోజులుగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను మానసిక వేదనకు గురిచేశాయి. ఆవేదనలో రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారు. కొందరు రూల్‌ బుక్‌ను చింపి నాపై విసిరారు. మరికొందరు టేబుళ్లపై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారు. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే నిద్రకూడా పట్టడం లేదు’ అని లేఖలో డిప్యూటీ చైర్మన్‌ పేర్కొన్నారు. తన నిరాహార దీక్షతో సభ్యులు కొంతైనా పశ్చాతాపం చెందుతారని ఆశిస్తున్నానని అన్నారు. తాను జయప్రకాశ్‌ నారాయణ్‌ గ్రామానికి చెందిన వాడినని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నారని తన రాజకీయ ప్రస్థానం సైతం బీహార్‌ నుంచే ప్రారంభమైందని తెలిపారు. వైశాలి ప్రజలకు ప్రజాస్వామ్యం విలువ తెలుసని అన్నారు.

కాగా వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ ఆరోపించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/