అరగంట పాటు పేలవ ప్రదర్శనతోనే ఈ స్థితి

టీమిండియా ఓటమిపై రోహిత్‌శర్మ

Rohit Sharma
Rohit Sharma, team india cricketer

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ నుంచి టీమిండియా వైదొలగడంపై భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మ తొలిసారి స్పందించాడు. గురువారం రాత్రి ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగపూరిత పోస్టు పెట్టి తన బాధను అభిమానులతో పంచుకున్నాడు. అవసరమైనపుడు జట్టుగా ఆడటంలో తాము విఫలమైనట్లు, అరగంట సేపు పేలవ ఆటతీరు ప్రపంచకప్‌ అవకాశాన్ని కోల్పోయేలా చేసిందని అన్నారు. ప్రస్తుతం తాను చాలా బాధలో ఉన్నానని, మీరు కూడా బరువైన హృదయాలతో ఉన్నారని తెలుసునని అన్నారు. ఇంగ్లాండ్‌ గడ్డపై భారత అభిమానుల నుంచి వచ్చిన స్పందన అమోఘమని అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/