18 బంతుల్లో 50 పరుగులు, ధోనిని దాటిన పంత్‌

rishab pant
rishab pant

ముంబై: ఐపిఎల్‌లో ధోని రికార్డును రిషబ్‌పంత్‌ను దాటేశాడు. ఆదివారం జరిగిన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌లో పంత్‌ బ్యాటింగ్‌తో ఖంగుతినిపించాడు. ఈ నేపథ్యంలో 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు. దీంతో 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై ధోని చేసిన ఫాస్టెస్ట్‌ ఆఫ్‌ సెంచరీ(20 బంతులు) రికార్డును పంత్‌ అధిగమించాడు.
ఐపిఎల్‌లో వేగవంతమైన అర్ధశతకం బాదిన ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్‌ గతేడాది కేవలం 14 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత సునీల్‌ నరైన్‌, యూసుఫ్‌ పఠాన్‌ 15 బంతుల్లో అర్ధశతకాలు సాధించారు.