సోనియాగాంధీని కలిసిన రేవంత్ రెడ్డి

Sonia Gandhi-Revanth Reddy family members
Sonia Gandhi-Revanth Reddy family members

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. సోనియాను కలిసిన వారిలో ఆయన భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. మర్యాదపూర్వకంగానే వీరు సోనియాను కలిసినట్టు సమాచారం. హైదరాబాద్ మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో… అదే బాటలో నడిచిన రేవంత్ రెడ్డి టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/