కాశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేత

Restrictions lifted in Kashmir
Restrictions lifted in Kashmir

New Delhi: కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్లో ఆంక్షలేత్తేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధించిన ఆంక్షలు 39 రోజుల తర్వాత తాజాగా ఎత్తేసింది. దీనిపై సమాచార, పౌర సంబంధాల అధికారులు ఓ ప్రకటన చేశారు. ఫోన్ ల్యాండ్‌లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చామని, కుప్వారా, హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు గణనీయంగా అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలను ఎత్తివేశామని క్రమంగా ప్రజలు బయటకి రావడం దీంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగినట్టు చెబుతున్నారు.