అతి తక్కువ వయసులోనే న్యాయమూర్తిగా బాధ్యతలు

Mayank Pratap with Family Members

Jaipur: రాజస్థాన్ లోని మాన్ సరోవర్ కు చెందిన 21ఏళ్ల మయాంక్ ప్రతాప్ దేశంలో, అతి తక్కువ వయసులోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో రాజస్థాన్ విశ్వవిద్యాలయంలో ఐదేళ్ల ఎల్ ఎల్ బీ డిగ్రీని పూర్తి చేసిన మయాంక్ అనంతరం జరిగిన రాజస్థాన్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమేకాక, టాపర్ గా నిలిచాడు. గతంలో ఈ పరీక్షకు అర్హత వయసు 23 ఏళ్లుగా ఉండేది. ఈ ఏడాది అర్హత వయసును 21ఏళ్లకు తగ్గించడంతో మయాంక్ కు ఆర్ జేఎస్ రాయడానికి వీలు కలిగింది. టాప్ ర్యాంక్ సాధించడంతో అతడికి న్యాయమూర్తిగా ఉద్యోగం లభించింది.. అతి పిన్న వయసులోనే న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన మయాంక్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అభినందనలు తెలిపారు..

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com