ఐపిఎల్‌లో బోణీ కొట్టని ఏకైక జట్టు ఆర్‌సిబి

RCB team
RCB team


కోల్‌కత్తా: ఐపిఎల్‌-2019 సీజన్‌లో ఇప్పటి వరకూ తన ఖాతా తెరవని ఏకైక జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. లీగ్‌లో ఇంకా ఖాతా తెరవని ఏకైక జట్టు కూడా ఇదే కావడం గమనార్హం. ఆడిన నాలుగు మ్యాచులు ఓడిపోయింది. మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన పోరులో బెంగళూరు జట్టు గెలుస్తుందేమోనని అనుకుంటే అది జరగలేదు. వరుసగా నాలుగో పరాజయంతో కోహ్లిసేన ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌తో బెంగళూరు జట్టు తలపడనుంది. ఇవాల్టి మ్యాచ్‌లోనైనా బెంగళూరు బోణీ చేస్తుందో లేదో వేచి చూడాలి. లేక ప్లేఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంటుందేమో చూడాలి.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/