దాంట్లో ఎటువంటి నిజం లేదు

రూమర్స్‌పై రకుల్‌ ఘాటైన రిప్లై

Rakul preet Singh

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌కి తనపై వస్తున్న రూమర్స్‌పై కోపం వచ్చేస్తోంది.. దీంతో ట్విట్టర్‌ వేదికగా ఆమె మండిపడ్డారు.

ప్రస్తుతం ఓ తమిళ మూవీలో రకుల్‌హీరోయిన్‌గా నటిస్తోంది.. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనటానికి రకుల్‌ ససేమిరా అంటున్నకారణంగా.. ఆమెను ఈచిత్రం నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నారని ఓ మీడియా ట్వీట్‌ చేసింది..

దీంతో రకుల్‌ తన ట్విట్టర్‌లో బాధ్యతాయుతమైన జర్నలిజం ఎపుడు వస్తుంది.. మీడియా నిజాలను తెలుసుకునే ప్రయత్నం ఎపుడు చేస్తుంది..

కొన్ని హిట్స్‌ కోసం మరీ దిగజారిపోతున్నారు.. అసలు ఎవరు ఎక్కడ షూటింగ్స్‌ జరుపుతున్నారో నాకు చెప్పండి.. ఇక్కడ పనిలేక చచ్చిపోతున్నాం.. అని పోస్ట్‌చేశారామె..

సదరు మీడియా చెప్పినదాంట్లో ఎటువంటి నిజం లేదని ఆమె కొంచెం గట్టిగానే చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/national/