దాన్ని నేను ఒప్పుకోను..

RAKUL PREET SINGH
RAKUL PREET SINGH

దాన్ని నేను ఒప్పుకోను..

టాలీవుడ్‌లో దాదాపు యువ హీరోలందరితో నటించింది రకుల్‌ప్రీత్‌సింగ్‌.. తెలుగులో స్పైడర్‌ చిత్రం తర్వాత ఆమె మరిం త క్రేజీ హీరోయిన్‌గా మారటం ఖాయం అనుకున్నారు కానీ. ఆ చిత్రం నిరాశపర్చింది.. ఒక దశలో అమ్మడు జోరుతగ్గిందనే వ్యాఖ్యలపై ఆమె తాజాగా స్పందించారు..ఓ ఇంటర్వ్యూలో రకుల్‌ మాట్లాడుతూ, స్పైడర్‌ చిత్రం తర్వాత తాను తెలుగు చిత్రాలకు కాస్త దూరం అయిన మాట వాస్తవమే. కానీ తాను అవకాశాలు లేకుండా మాత్రం లేను. అని తమిళం, హిందీల్లో వరుసగా చిత్రాలు చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.. డైరీలో 30 రోజులు మాత్రమే ఉంటున్నాయని, ఎంత ప్రయత్నించినా కూడ ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానని చెప్పింది.. నెలలో ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ సినిమాలు చేసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.. తాను ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాలనుచేయటంతోపాటు, హిందీలో అజ§్‌ుదేవగన్‌తో ఒక చిత్రం చేస్తున్నట్టు తెలిపింది.. తెలుగు నుంచి ఆఫర్లు వచ్చినా ఒప్పుకునే పరిస్థితి లేదు అన్నట్టుగా చెప్పింది..