భారత్‌-చైనా సరిహద్దులపై రాజ్‌నాథ్‌ కీలక ప్రకటన

చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయి

Rajnath Singh

న్యూఢిల్లీ: భారత్-‌చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో కీలక ప్రసంగం చేశారు. చైనా మాటలు ఒకలా, చేతలు మరోలా ఉన్నాయని ఆయన చెప్పారు. చైనాతో ఎలాంటి పరిస్థితులున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చైనా చర్యలకు భారత సాయుధ బలగాలు ఇప్పటికే గట్టిగా సమాధానమిచ్చామని చెప్పారు. ఒప్పందాలను చైనా బహిరంగంగానే ఉల్లఘింస్తుందని తెలిపారు. 1988 తర్వాత భారత్‌, చైనాలు అనేక ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు నిదర్శనమని, ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. 1962లో చైనాలో 38వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ నుంచి 5,000 చదరపు కిలోమీటర్ల భూమిని కూడా తీసుకొందని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/