రూ.2వేల కోట్ల పెట్టుబడి హుష్‌కాకీ

RAJKUNDRA1
RAJKUNDRA

బిట్‌కాయిన్‌ కుంభకోణం
రాజ్‌కుంద్రాకు సమన్లు

రూ.2వేల కోట్ల పెట్టుబడి హుష్‌కాకీ

ముంబయి: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు బాలివుడ్‌ నటి శిల్పాశెట్టిభర్త రాజ్‌కుంద్రాకు బిట్‌కాయిన్‌ కుంభకోణంలో సమన్లుజారీచేసారు. ముంబైలోని ఇడి కార్యాల యాలో ఆయన్ను అధికారులు బిట్‌కాయిన్‌ అవకతవకలకు సంబంధించి పలు ప్రశ్నలు వేసారు. రాజ్‌కుంద్రాను ఇడి అధికా రులు బిట్‌కాయిన్‌ కేసులకు సంబంధించి మరింతగా సమాచారం కావాలని కోరారు. బిట్‌కాయన్‌ట్రే డింగ్‌లోమనీలాండరింగ్‌ జరిగిందన్న అరోపణలపైనే ఇడి అధికారులు ఆయన్ను ప్రశ్నిం చారు.

ఈ కేసులో కుంద్రాతో లింక్‌ అయి అనేక అంశాలు ఇమిడి ఉన్నాయని అందువల్లనే ఆయన వాంగ్మూలాన్ని రికార్డుచేయాల్సి వచ్చిందని ఇడి అధికారులు వెల్లడించారు. బిట్‌కాయిన్‌ కేంద్రంగా జరుగుతునన పెట్టు బడుల వెబ్‌సైట్‌ గెయిన్‌బిట్‌కాయిన్‌ సంస్థపైనా, వ్యవస్థాపకుడు అమిత్‌ భరద్వాజ్‌ మరో ఎనిమిది మందిపై ఇడి అధికారులు కేసులు నమోదుచేసారు.

మొత్తం ఎనిమిదివేలమందికిపైగా ఇన్వెస్టర్లు రూ.2 వేల కోట్ల నిధులు నష్టపోయినట్లు తేలింది. మహారాష్ట్ర పోలీసులు, పూణె పెఓలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఇడి అధికారులు కేసు నమోదుచేసారు. అంతేకాకుండా సంస్థ వ్యవస్థాపకుడు భరద్వాజ్‌, ఆయన సోదరుడు వివేక్‌లను ఢిల్లీనుంచి గతంలోనే అరెస్టులుచేసారు. భరద్వాజ్‌ వివిధ వెంచర్లు గెయిన్‌ బిట్‌కాయిన్‌, జిబిమైనర్స్‌, ఎంక్యాప్‌, జిబి21 వంటి సంస్థలను నిర్వహించారు.

ఈ పోర్టళ్లపై లావా దేవీలునిర్వహించిన ఇన్వెస్టర్లు ఇదంతా మోసమని గుర్తించి పోలీసు ఫిర్యాదులుచేసారు. కేంద్ర దర్యా ప్తుసంస్థ తన దర్యాప్తును బిట్‌కాయిన్‌; క్రిప్టోకరెన్సీ లావాదేవీఆలుసైతం వివిధ విభాగాలపరిధిలో దర్యాప్తుచేస్తోంది. భరద్వాజ్‌ ఆయన సన్నిహితులు ఇన్వెస్టర్లను రెండువేలకోట్లవరకూ ముంచేసారని ప్రాథమికంగా తేలింది. ముంబయి, పూణె, నాందేడ్‌, కొల్హాపూర్‌, ఇతర ప్రాంతాల్లోసైతం ఈ లావాదేవీలు జోరుగాసాగాయి.

గత ఏడాది ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుకు నివేదిక ఇస్తూ బిట్‌ కాయిన్‌ క్రమబద్దీకరణకు ఎలాంటి చట్టాలులేవని, అయితే భారత్‌లో ఇలాంటి కరెన్సీ లావాదే వీలను అనుమతించేదిలేదని అన్నారు. అంతేకాకుండా ఆర్‌బిఐ సైతం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, సరికదా ఎలాంటిసంస్థలకుసైతం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇన్వెస్టర్లను ఇలాంటి కరెన్సీలపై ట్రేడింగ్‌ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని బిట్‌కాయిన్‌ వంటి కరెన్సీలు దేశంలో చిట్‌ఫండ్‌కంపెనీలతో సమానమని, ఎలాంటి చట్టబద్ధత వాటికిలేవని పదేపదేచెపుతూ వచ్చింది. అయినప్పటికీ బాలివుడ్‌ సెలబ్రిటీలుసైతం ఇలాంటి వ్యాపారంలో జోక్యం చేసుకుంటున్నారంటే వ్యాపారం ఎంతమేరసాగుతున్నదో అవగతం అవుతున్నది.