శ్రీలంక ప్రధానిగా మళ్లీ రాజపక్స

పార్లమెంట్‌ ఎన్నికల్లో జయభేరి

rajapaksa

కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్‌ పార్టీ (ఎస్‌ఎల్‌పీపీ) జయభేరి మోగించింది. ఏకంగా మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకున్నది. 225 స్థానాలున్న శ్రీలంక పార్లమెంట్‌లో ఎస్‌ఎల్‌పీపీ 145 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య150కి చేరుతుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఎన్నికలు బుధవారం పూర్తికాగా.. ఎన్నికల సంఘం శుక్రవారం ఫలితాలను ప్రకటించింది. తమపై సంపూర్ణ విశ్వాసం కనబరిచినందుకు శ్రీలంక ప్రజలకు రాజపక్స ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన నాలుగోసారి ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/