దక్షిణాదిలోనూ రాహుల్‌ పోటీ చేయనున్నారా?

rahul gandhi
rahul gandhi


ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొందరు సీనియర్‌ నేతలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఈ సారి దక్షిణాదిలోనూ పోటీ చేయమని కోరారని తెలుస్తుంది. వారి కోరిక మేరకు రాహుల్‌ ఎప్పుడు పోటీ చేసే ఉత్తర ప్రదేశ్‌లోని అమేథితో పాటు కర్ణాటక నుంచి కూడా బరిలోకి దిగనున్నారని పార్టీ వర్గాల సమాచారం. కన్నడ రాష్ట్రంలో ఓ కీలక స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సోనియా గాంధీ కూడా బళ్లారి నుంచి పోటీ చేసి సుష్మా స్వరాజ్‌ మీద గెలుపొందిన విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ కూడా 2014 ఎన్నికల్లో వారణాసి, వడోదర నియోజకవర్గాల నుంచి పోటీ చేసారు. అయితే, దక్షిణాదిలో తాను పోటి చేయనున్న అంశంపై రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ వర్గాలు ఎవరూ స్పందించకపోవడంతో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సి ఉంది.
ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభం కానున్న 2019 లోక్‌సభ ఎన్నికలకు.. దేశంలో 543 లోక్‌సభ స్థానాలకుగాను ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తాజా జాతీయ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/