దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది

దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తి తీరే ఇందుకు కారణం

Rahul Gandhi
Rahul Gandhi

కేరళ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళలోని సుల్తాన్‌ బతేరిలో ఏర్పాట్లు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడిపై విమర్శలు గుప్పించారు. ‘దేశంలోని మైనార్టీలపై హింస పెరిగిపోతోంది. వారిపై ద్వేషాన్ని పెంచుతున్నారు. అలాగే, దేశంలోని దళితులు, గిరిజనులపై కూడా హింస పెరిగిపోతోంది. వారిపై దాడులకు పాల్పడుతున్నారు. గిరిజనుల భూములను లాక్కుంటున్నారు’ అని విమర్శించారు.’దేశంలోని వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయి. కొందరు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇందుకు కారణం దేశాన్ని పాలిస్తోన్న వ్యక్తే (ప్రధాని మోడి). ఆయన హింసను, అధికార దుర్వినియోగాన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా హింస పెరిగిపోతోంది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, దాడులు జరుగుతోన్న విషయాన్ని ప్రతి రోజు మనం దినపత్రికల్లో చదువుతున్నాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/