25 కోట్ల మందికి ఏటా రూ. 72 వేలు

rahul gandhi
rahul gandhi

న్యూఢిల్లీ: కనీస ఆదాయ పథకం వివరాలను ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకం కింద ప్రతి ఏటా దేశంలోని 20 శాతం నిరుపేదలకు రూ.72 వేలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ డబ్బంతా నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని రాహుల్ తెలిపారు. దేశంలోని 20 శాతం అంటే.. 5 కోట్ల కుటుంబాల‌కు (సుమారు 25 కోట్ల మంది) ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ఆయన చెప్పారు. ఆర్థికంగా ఇది సాధ్యమే. గత నాలుగైదు నెలలుగా ఈ పథకంపై అధ్యయనం చేస్తున్నాం. ఇది అత్యంత శక్తివంతమైన ఆలోచన అని ఆయన చెప్పారు.
నెల‌కు ఒక్కో కుటుంబం క‌నీసం రూ.12 వేల ఆదాయం పొందేలా ఈ ప‌థ‌కం రూపొందించిన‌ట్లు రాహుల్ తెలిపారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక కుటుంబం నెల‌కు రూ.6 వేలు సంపాదిస్తుంది అనుకుంటే.. దానిని రూ.12 వేల‌కు పెంచుతామ‌ని రాహుల్ చెప్పారు. ఇదొక చారిత్ర‌క ప‌థ‌కం అని ఆయ‌న ప్ర‌క‌టించారు.ఇది పేద‌రికంపై జ‌రిగే చివ‌రి యుద్ధం అని రాహుల్ అన్నారు.