కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలు

RAHUL GANDHI
RAHUL GANDHI

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలు

కోర్‌ కమిటీలో 9, మేనిఫెస్టోలో 19, ప్రచార కమిటీలో 13 మంది సభ్యులు
కేరళ నుండి ఇద్దరు, కర్ణాటక నుండి మరో ఇద్దరు

న్యూఢిల్లీ, : 2019 సాధారణ ఎన్నికల నగారా ఇంకా మోగకుండానే వివిధ రాజకీయ పార్టీలు సమర శంఖాలుపూరిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయా, జమిలి ఎన్నికలు వస్తాయా అన్న సంశయం వీడకుండానే ఎవరికి వారు ఎన్నికలసన్నాహాలను కోలాహలంగా ప్రారంభిస్తున్నారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ శనివారం సంస్థాగతంగా ఎన్నికల కమి టీలను ప్రకటించి రాజధానిలో రాజకీయ వేడికి ఒక్కసారిగా పెంచేసింది. లం డన్‌లో స్కూల్‌ ఆప్‌ ఎకనామిక్స్‌లో ప్రసంగిస్తూ ఒకపక్క పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తుండగా..మరోవైపు పార్టీ జనరల్‌ సెక్రెటరీ అశోక్‌ గెహలాట్‌ ఎన్నికల కమిటీల సమాచారాన్ని మీడియాకు వెల్ల డించారు. సీనియర్లు, యువనాయకులు, మేథావ్ఞల మేలు కలయి కతో ముచ్చటగా మూడుకమిటీలను కాంగ్రెస్‌శనివారం ప్రకటించింది.