పద్మభూషణ్ సింధు

PV Sindhu

New Delhi: ప్రపంచ చాంపియన్‌ పి.వి.సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక పద్మ భూషణ్‌ అవార్డుకు ప్రతి పాదించింది. మొత్తం 9మంది క్రీడా కారిణుల పేర్లను పద్మ అవార్డులకు ప్రతిపాదించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్‌ చాంపి యన్‌ మేరీ కోమ్‌ను రెండో అత్యున్న త పౌర పుర స్కారం పద్మ విభూషణ్‌కు ప్రతి పాదించారు. అత్యు న్నత పౌర పురస్కా రం భారత రత్న తరు వాత స్థానంలోని పద్మ విభూష ణ్‌ పురస్కా రానికి ఒక మహిళ పేరును ప్రతిపాదించడం ఇదే ప్రథమం. క్రీడా రంగానికి సంబంధించి పద్మ విభూషణ్‌ అందుకోనున్న నాలుగో వ్యక్తి మేరీ కోమ్‌. పద్మ అవార్డుల జాబితాను కేంద్ర హోంశాఖ ఆమోదానికి పంపిం చామని, పద్మ అవార్డుల కమిటీ ఆమోదించిన తరువాత తుది జాబితా ప్రకటిస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పద్మ అవార్డుల తుది జాబితాను వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్ల డించ ను న్నట్టు తెలి పారు.