ధోనిపై విమర్శలు తగ్గించండి

మయాంక్‌ క్లాస్‌ ప్లేయర్‌

M S Dhoni
M S Dhoni

బర్మింగ్‌హామ్‌: టీమిండియా వికెట్‌ కీపర్‌, మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోని బ్యాటింగ్‌పై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ అతనికి మద్దతుగా నిలిచాడు. ఈ వయసులో ధోనిని నిందించడం సరికాదని, అతడికి బదులు కేఎల్‌ రాహుల్‌ వంటి యువకులు జట్టుని గెలిపించే బాధ్యతలు తీసుకోవాలని తెలిపాడు. మీడియా ధోనీపై ఎక్కువ దృష్టిసారించవద్దని..నిజంగా తాను టీమిండియా అభిమానే ఐతే రాహుల్‌ మీద ఒత్తిడి తీసుకురావాలని పేర్కోన్నాడు.
ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన విజయ్‌ శంకర్‌కి బదులు మయాంక్‌ అగర్వాల్‌ని ఎంపిక చేయడంపై మంజ్రేకర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. మయాంక్‌ క్లాస్‌ ప్లేయర్‌ అని, అతడి ఎంపిక తనని ఆశ్చర్యానికి గురి చేసిందని వివరించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/